చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 31 October 2022

చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య !


పశ్చిమ బెంగాల్‌లోని  విద్యార్థిని డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె సెప్టెంబర్‌ 29న తన చెల్లెలుతో కలసి ఒక షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది. ఆ సమయంలో సదరు విద్యార్థిని కొన్ని చాక్లెట్లను దొంగతనం చేస్తూ పట్టుబడింది. అయితే ఆ తర్వాత ఆమె సదరు షాపు యజమానికి క్షమాపణలు చెప్పి బిల్‌ పే చేసి వచ్చేసింది. కానీ ఆ ఘటనను సదరు షాపు వాళ్లు వీడియో తీసి సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. దీంతో తన కూతురు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు బాధితురాలి తండ్రి ఆవేదనగా చెబుతున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని సదరు షాపు వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. అంతేగాదు ఆ వీడియోని ఆన్‌లైన్‌ పోస్ట్‌ చేసి ఆమె మృతికి కారణమైన వాళ్లని గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమే గాక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment