కాటేసిన పామును కొరికి చంపిన బాలుడు !

Telugu Lo Computer
0


చత్తీస్ గఢ్ లోని జష్‌పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న అక్క వాళ్లింట్లో పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి పక్కనే ఉన్న పొదలో నుంచి నాగుపాము బయటకు వచ్చి తన చేతికి తాకింది. దానిని వదిలించుకొనే క్రమంలో దీపక్ కుడిచేతి బొటన వేలును కాటు వేసింది. నొప్పిగా ఉండటంతో పాము కాటేసిందని గుర్తించాడు. ఒక్కసారిగా కోపంతో పాము వెనుకాలే వెళ్లి దానిని పట్టుకున్నాడు. అది బుసలు కొడుతున్నా భయపడకుండా దాని తల కింద భాగంలో నోటితో కొరకగా అది చనిపోయిందని దీపక్ చెప్పాడు. తమ్ముడికి పాము కరిచిన విషయం తెలుసుకున్న అక్క కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు దీపక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం దీపక్ పూర్తిగా కోలుకున్నాడు. పాము కాటేసినా విషం ప్రభావం చూపదనే మూఢనమ్మకం జష్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చివరన ఉన్న జష్‌పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ తహసీల్దార్ పరిధి ప్రాంతాలను నాగాలోక్ అని పిలుస్తారు. కింగ్ కోబ్రా వంటి చాలా విషపూరితమైన పాములు ఛత్తీష్‌గఢ్ ఒడిశా రాష్ట్రాన్ని కలిపే రాష్ట్ర హైవే వెంబడి ఉన్న తప్కారా, దాని చుట్టుపక్కల గ్రామాలలో కనిపిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)