తెలంగాణకు రెండు ఎయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి

Telugu Lo Computer
0

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద చేర్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఇదేకాక, విమానాశ్రయాల చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఉన్న రామగిరి ఖిల్లా, వేములవాడ, రామగుండం, సింగరేణి గనులు, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ వన్యప్రాణి ప్రాంతాలు, నిజామాబాదులోని ప్రాజెక్టులకు పర్యాటకుల తాకిడి పెరగనుంది. కాళేశ్వరం, మేడారం జాతరలకు వచ్చే సందర్శకులు విమానాల్లో రాకపోకలు సాగించే వీలు కలిగింది. ఈ రెండు విమానాశ్రయాలు రెండు దశాబ్దాల కిందటి వరకు సేవలందించాయి. మామునూరు విమానాశ్రయాన్ని 1930లో నిజాం రాజు నిర్మించగా, బసంత్ నగర్ విమానాశ్రయాన్ని స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తన రాకపోకలకు అనువుగా 1980లో నిర్మించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)