మహానందిలో డ్రోన్ కలకలం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రాల పై డ్రోన్ల సంచారం కలకలం గా మారింది. గతంలో శ్రీశైలం ఆలయం పై డ్రోన్ కెమెరాలు సంచరించడం ఆందోళనకు గురి చేయగా, ప్రస్తుతం మహానంది ఆలయం పై డ్రోన్ల సంచారం ఆలయ అధికారులకు ఆందోళన కలిగిస్తుంది. నాలుగు రోజులపాటు రాత్రి సమయాల్లో శ్రీశైలంపై డ్రోన్ కెమెరాలు సంచరించడం చర్చనీయాంశమైంది. నాలుగు రోజులు శ్రీశైలం ఆలయం చుట్టూ తిరిగిన డ్రోన్లు ఆలయ అధికారులను టెన్షన్ పెట్టాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో  పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహానంది ఆలయం పైన కూడా డ్రోన్ తిరగడం, ఏరియల్ వ్యూ చిత్రీకరించడం కలకలం గా మారింది. మహానంది ఆలయం పై డ్రోన్ సంచరించడం గుర్తించిన ఆలయ అధికారులు, డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నం చేశారు. అతను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పటికే పరిస్థితిని గుర్తించిన సదరు అగంతకుడు కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని పట్టుకోవడానికి ఆలయ సిబ్బంది దాదాపు ఆరు కిలోమీటర్ల మేర అతనిని వెంబడించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తి పారిపోవడంతో, ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లో పరిశీలించారు. అయితే సిసి టివి ఫుటేజ్ లో దృశ్యాలు క్లారిటీగా లేకపోవడం, కారు నెంబరు కనిపించకపోవడంతో అతడిని పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)