రాత్రి భోజనం త్వరగా ముగించండి !

Telugu Lo Computer
0


ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం హెల్తీ ఫుడ్ హాబిట్స్ ను ఫాలో అవడం చాలా అవసరం. ముఖ్యంగా బాడీ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఇది మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. చాలా మంది హోటళ్లకు వెళ్లేటప్పుడు చాలా రకాల ఆహార పదార్ధాలను ఆర్డర్ ఇస్తారు. కానీ వాటిని తినలేక వేస్ట్ చేస్తుంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా మన శరీరానికి అవసరమైన ఆహారం కంటే ఎక్కువ మొత్తంలో తినడం గానీ, తక్కువ ఆహారం తీసుకోవడం గానీ జరుగుతుంది. ఇది మన లైఫ్ స్టైల్ పై ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా మన కు ఏమేమీ కావాలో, ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవడం ఉత్తమం. సాదారణంగా చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో డైటింగ్ చేస్తుంటారు. కానీ ఆ సమయంలో ఇష్టమైన ఆహారాన్ని చూడగానే తినాలనే కోరిక కలుగుతుంది. అలాంటప్పుడు జంక్ ఫుడ్ పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. దీంతో హెల్త్ పాడవుతుంది. అలాంటప్పడు జంక్ ఫుడ్ కాకుండా స్నాక్స్ గా హెల్తీ ఫుడ్ ను తీసుకోవడం ఉత్తమం. అయితే.. డైట్‌లో ఉన్న వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. శరీరానికి సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషక పదార్థాలు అందవు. అవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతే కాకుండా నీట్ గా ఫుల్ గా తినడం మంచిది. ఇలా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అధ్యయనం ప్రకారం.. 250 mg కెఫిన్ గుండెకు మంచిది. అంతే కాకుండా కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చిరాకు లేదా ఆత్రుతగా అనిపించిన సమయంలో కాఫీ ని సిప్ చేయడం ద్వారా మంచి బెనెఫిట్స్ ను పొందవచ్చు. ముఖ్యంగా రాత్రి భోజనం త్వరగా ముగించాలి. ఇది గేమ్ ఛేంజర్ లా ఉపయోగపడుతుంది. మీరు దీన్ని ప్రతిరోజూ చేయలేకపోయినా, వారానికి 3-4 సార్లు చేయండి. ఇది మీ కార్టిసాల్‌ను ప్రేరేపించకుండా సహాయపడుతుంది. మెలటోనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)