భార్యను చంపి నగ్నంగా చేసి సూట్ కేసులో పెట్టి....! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 20 October 2022

భార్యను చంపి నగ్నంగా చేసి సూట్ కేసులో పెట్టి....!


ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ కు చెందిన రాహుల్ (22) అనే యువకుడు గురుగ్రామ్ లో  నివాసం ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హర్యానాలో నివాసం ఉంటున్న ప్రియాంకా అలియాస్ ప్రియా (21) అనే యువతిని మూడు సంవత్సరాల క్రితం రాహుల్ వివాహం చేసుకున్నాడు. వీరికి  18 నెలల పాప ఉంది. వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే రాహుల్, ప్రియాంక దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా భర్తకాని, భార్య కాని ఎవ్వరిమాట వినకుండా వాళ్లదారిలో వాళ్లు వెళ్లడం మొదలుపెట్టారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాహుల్ కు వచ్చే జీతంతో ఇంటి బాడుగ కట్టుకుని భార్య ప్రియాంక, కుమార్తెను చూసుకోవడానికి సరిపోతా ఉంది. ఇదే సమయంలో తనకు ఫ్రిజ్, ఎల్ ఇడీ టీవీ, వాషింగ్ మిషన్ కావాలని ప్రియాంక ఆమె భర్త రాహుల్ ను అడగడం మొదలుపెట్టింది. రానురాను దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఇంటికి వెళ్లిన భర్త రాహుల్ తో అతని భార్య ప్రియాంక తనకు ఇదే నెలలో ఫ్రిజ్, ఎల్ ఇడీ టీవీ, వాషింగ్ మిషన్ కావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయంలో దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో ప్రియాంక ఆమె వేసుకునే చెప్పు తీసుకుని భర్త రాహుల్ ను కొట్టింది. సహనం కోల్పోయిన రాహుల్ ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకుని అతని భార్య ప్రియాంక గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఆ రోజు రాత్రి భార్య శవం ఇంట్లో పెట్టుకుని కూతురితో సరదాగా ఆడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వరకు పాపను ఆడించిన రాహుల్ తరువాత పాపకు పాలు తాగించి తెలిసిన ఆటో డ్రైవర్ ను పిలిపించుకుని బజారుకు వెళ్లి లగేజ్ సూట్ కేసు తీసుకుని వచ్చాడు. భార్య ప్రియాంకను నగ్నంగా చేసి శవాన్ని సూట్ కేసులో పెట్టుకుని స్నేహితుడి ఆటోలో వెళ్లి గురుగ్రామ్ సమీపంలోని ఇఫ్కో చౌక్ సమీపంలో అటువైపు పరిశీలించిన తరువాత పెద్ద సూట్ కేసు ఆటోలో నుంచి బయటకు తీసి రోడ్డు పక్కన పడేశారు. తరువాత రాహుల్ అతని వెళ్లి ఆటో డ్రైవర్ తో కలిసి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. రోడ్డు పక్కన సూట్ కేసు పడిఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూట్ కేసు తీసి చూస్తే ప్రియాంక శవం బయటపడింది. ప్రియాంకను గొంతు కోసి హత్య చేసి నగ్నంగా తయారు చేసి శవాన్ని సూట్ కేసులో పెట్టి తీసుకుని వచ్చి విసిరేశారని గుర్తించిన స్థానికులు హడలిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రియాంక భర్త రాహుల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment