బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

Telugu Lo Computer
0


బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయినట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ముంబైలో మంగళవారం బీసీసీఐ ఏజీఎం జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ ఏకాభిప్రాయంతో రోజర్ బిన్నీని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఈ పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో బిన్నీ ఎన్నిక సులువుగా మారింది. మరోవైపు బీసీసీఐ సెక్రటరీగా మరోసారి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఇప్పటి వరకు ట్రెజరర్‌గా పనిచేసిన అరుణ్ ధుమాల్ నూతన ఐపీఎల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 67 ఏళ్ల రోజర్ బిన్నీ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. ఆయన టీమిండియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ తండ్రి. రోజర్ బిన్నీ 1983లో భారత్‌కు ప్రపంచ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. తన బౌలింగ్ నైపుణ్యాలతో 18 వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో భారత్ తరఫున 27 టెస్ట్ మ్యాచులు, 72 వన్డేలు ఆడాడు. అంతేకాకుండా నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. అటు కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బిన్నీ కోచ్‌గా వ్యవహరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)