మరో మూడు రోజుల పాటు వర్షాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 9 October 2022

మరో మూడు రోజుల పాటు వర్షాలు !


దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు  ఇలాగే కొనసాగే అవకాశం తెలిపింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిని హెచ్చరించింది. 

No comments:

Post a Comment