కాంగ్రెస్ అధినేతగా ఖర్గే

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఆ పదవి చేపడుతున్న గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. జగ్‌జీవన్ రామ్‌ తర్వాత కాంగ్రెస్ సారథి అయిన రెండో దళిత నేతగా నిలిచారు. 1942 జూలై 21న కర్ణాటక బీదర్‌లో జన్మించారు. కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై 1969లోనే ఆ పార్టీలో చేరారు. గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లహోతి కాలేజీలో లా చదివారు. జూనియర్‌ న్యాయవాదిగా ఉన్నసమయంలోనే కార్మిక సంఘాల కేసులను వాదించి గెలిచారు. 1969లోనే గుల్బార్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. 1972లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1973లో ఒక్ట్రోయి అబాలిషన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకలో మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడటానికి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక కీలకంగా వ్యవహరించింది. 1976లో ప్రాథమిక విద్యా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 16,000కుపై ఎస్సీ,ఎస్టీ టీచర్ల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేశారు. దేవరాజ్ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా, గుండూరావు కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగాకూడా పనిచేశారు. ఎస్ఎం కృష్ణ హయాంలో హోంమంత్రిగా ఉన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)