కరోనాతో అత్యధిక పేదల్ని సృష్టించిన భారత్ !

Telugu Lo Computer
0


కోవిడ్ కారణంగా అత్యధిక మంది పేదల్ని సృష్టించిన దేశంగానూ భారత్ రికార్డుల్లో నిలుస్తోందని ఐఎంఎఫ్ తాజా నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సమయంలో అంటే 2020 ఏడాదిలో పేదలైన వారిలో 80 శాతం మంది భారత్ లోనే ఉన్నారని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మొత్తం 7 కోట్ల మంది పేదలుగా మారిపోతే, ఇందులో 5.6 కోట్ల మంది భారత్ లోనే ఉన్నట్లు ప్రపంచబ్యాంక్ గణాంకాలు వెల్లడించింది. అంతే కాదు ఈ గణాంకాలు కూడా భారత్ ప్రపంచానికి ఇవ్వలేదని కూడా తెలిపింది. 2011 నుంచి భారత్ పేదరిక గణాంకాలు బయటపెట్టడం లేదు. వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో ప్రపంచ పేదరికం అంచనాలను రూపొందించడంలో భారతదేశం నుండి పేదరికంపై అధికారిక సమాచారం లేకపోవడం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఆందోళన వ్యక్తం చేసింది. 2019తో పోలిస్తే 2020లో కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా పేదరిక స్ధాయి శాతం 8.4 నుంచి 9.3 శాతానికి చేరినట్లు ప్రపంచ బ్యాంక్ నివేదికలో తెలిపింది. దీంతో పాటు దశాబ్దాలుగా పేదరికాన్ని తగ్గించేందుకు వివిధ దేశాల్లో అమల్లో ఉన్న కార్యక్రమాలు కూడా తొలిసారి 2020లో నిలిచిపోయినట్లు ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. దీంతో అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కలుపుకుని 7 కోట్ల మంది వరకూ పేదరికంలోకి వెళ్లిన్నట్లు ఐఎంఎఫ్ నివేదిక చెబుతోంది. ఈ లెక్కన అంతర్జాతీయంగా ప్రస్తుతం పేదల సంఖ్య 70 కోట్ల వరకూ వెళ్లినట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)