టోల్‌ ప్లాజా సిబ్బందిపై లా స్టూడెంట్స్ దాడి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్ టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పుత్తూరు ప్రైవేట్ కళాశాలలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో గత కొద్దిరోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు పరీక్షలు చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాలపేట ఎస్వీ పురం టోల్‌ప్లాజా వద్ద లా చదువుతున్న విద్యార్థి కారు టోల్ రుసుము చెల్లింపులో టోల్ సిబ్బందితో లా విద్యార్థులు గొడవకు దిగారు. రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు లేనందున టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పడంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా టోల్ సిబ్బందిపై హెల్మెట్‌తో దాడి చేశారు. రుసుము చెల్లింపు జరగకపోవడం గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న వడమాలపేట ఎస్సై రామాంజనేయులు లా విద్యార్థులతో ముఖాముఖిగా జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వమన్నారు. పబ్లిక్ వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కకు రమ్మని చెప్పినప్పటికీ లా విద్యార్థులు మొండిగా వ్యవహరించడమే కాకుండా వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. టోల్ ప్లాజా ప్రదేశానికి చేరుకున్న స్థానికులపై విద్యార్థులు దాడికి దిగారు. అనంతరం స్థానికులు కూడా తిరగబడి వారిపై దాడి చేయడంతో పోలీసులకు తగినంత సంఖ్యాబలం లేనందున నియంత్రించలేకపోయారు. లా విద్యార్థులు ప్రాంతీయ భావాన్ని పదే పదే వ్యక్తపరుస్తూ టోల్‌గేట్‌ లైన్‌లో తమిళనాడు వాహనాలకు దారి వదులుతూ ఏపీకి సంబంధించిన వాహనాలను నిర్బంధిస్తూ లా విద్యార్థులు ధర్నాకు దిగారు. సదరు ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని వనమాలపేట ఎస్సై రామాంజనేయులు తెలిపారు

Post a Comment

0Comments

Post a Comment (0)