రబీ పంటలకు మద్దతు ధర పెంపు

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) రబీ పంటలకు ( గోధుమ, మసూర్ పప్పు, బార్లీ, శనగలు, సన్ ఫ్లవర్, ఆవాలు) మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్‌ 2022-23 (జూలై-జూన్‌), మార్కెటింగ్‌ సీజన్‌ 2023-24 కాలానికి గానూ ఎంఎస్‌పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా కేంద్రం అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)