టాటా గ్రూప్ ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీ 1MG - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 16 October 2022

టాటా గ్రూప్ ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీ 1MG


తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం కోసం ఏదైనా ప్రారంభించాలనుకునే వారికి దేశంలోని ప్రసిద్ధ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ అందిస్తోంది. అవును దీని కోసం మీరు టాటా గ్రూప్ కంపెనీలో భాగస్వామి కావాల్సి ఉంటుంది. టాటాలకు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీ 1MG ఈ సదవకాశాన్ని అందిస్తోంది. టాటా గ్రూప్ కు చెందిన ఫార్మసీ 1MG ఆరోగ్య భాగస్వాముల కోసం వెతుకుతోంది. తనతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది. ఇందుకోసం మీరు టాటా గ్రూప్‌కు వ్యాపార భాగస్వామిగా పని చేయవచ్చు. 1MG తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ పేరు 1MG హెల్త్ పార్టనర్. దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి సరైన సేవలను అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం కంపెనీ హెల్త్ కేర్ పార్టనర్లు కావాలని వెతుకుతోంది. ఇప్పటివరకు 600 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు ఈ కార్యక్రమంలో చేరారు. మీరు కూడా ఈ ప్రోగ్రామ్‌లో చేరితే వేల రూపాయలు సంపాదించవచ్చు. మీరు ఆరోగ్య భాగస్వామి అయినప్పుడు కంపెనీ మంచి ప్రోత్సాహకాలను అందజేస్తుంది. కంపెనీలో చేరిన తర్వాత, వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో మీకు సమాచారం అందించబడుతుంది. దీనితో పాటు టెక్నాలజీ, మార్కెటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు కూడా ఇవ్వబడతాయి. 1MG ఆరోగ్య భాగస్వాములు లీడ్‌లను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తారు. ఆరోగ్య భాగస్వాములుగా ఉన్నవారు ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి మందులు కొనుగోలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ విషయాన్ని భాగస్వామి ప్రజలకు చెప్పాలి. 1ఎంజీ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారనే విషయాన్ని వివరించాల్సి ఉంటుంది. కస్టమర్లు అనేకమార్లు తిరిగి సంస్థ సేవలను పొందేలా ఈ భాగస్వాములు చేయాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్య భాగస్వామి కావాలనుకుంటే.. అందుకోసం ముందుగా Tata 1MG అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. భాగస్వామి అయ్యేందుకు అక్కడ అడిగిన అన్ని వివరాలను పూరించాలి. మీ ప్రొఫైల్ షార్ట్‌లిస్ట్ చేయబడితే, మీకు కంపెనీ నుండి కాల్ వస్తుంది. మీరు ప్లాట్‌ఫారమ్‌లో చేరాలనుకుంటే అందుకోసం రూ.15,000 రుసుము చెల్లించాలి. ఇవి తిరిగి చెల్లించబడవు. మొత్తం ప్రక్రియ కేవలం 7 రోజుల్లో పూర్తవుతుంది. ఇందులో చేరటం వల్ల సంపాదన ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. కంపెనీ అధికారికి వెబ్ సైట్ వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి అంటే హెల్త్ కేర్ పార్టనర్ నెలకు 300 ఆర్డర్‌లు పొంది అవి ఒక్కో ఆర్డర్ విలువ రూ.500 ఉన్నట్లయితే మొత్తం ఆర్డర్ రూ.1.50 లక్షలు అవుతుంది. ఆ ఆర్డర్‌లపై భాగస్వామికి రూ.7,650 కమీషన్ లభిస్తుంది. అలా ఆర్డర్లు పెరిగే కొద్ది ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా టౌన్ లో ఉన్న వ్యక్తి నెలకు సగటున 2000 ఆర్డర్లు చేయగలిగితే అతనికి సుమారు రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తుంది. అంటే ఇంటి వద్దనే కూర్చుని నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చు.

No comments:

Post a Comment