రాజీనామాపై వెనక్కి తగ్గేదిలేదు

Telugu Lo Computer
0


విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌  మాట్లాడతూ రాజీనామాపై తన స్వరం మారలేదని, వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. పదవులు లేకపోయినా భాషాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం కారణంగానే పేరు మార్పు ఇష్టం లేక రాజీనామా చేశారన్నారు. ''సీఎం కార్యాలయానికి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్‌కు మెయిల్‌ ద్వారా రాజీనామా లేఖలు పంపా. పదవి నుంచి వైదొలుగుతున్నానని మా సిబ్బందిని పిలిచి చెప్పా. నాకు ఇప్పటి వరకు ప్రభుత్వంలో జీతం వస్తోంది కాబట్టీ .. విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా నా పింఛను వద్దని ఈ పదవి తీసుకున్నప్పుడు యూనివర్సిటీకి లేఖ రాశా. ఈనెల నుంచి నేను పదవిలో లేను కాబట్టీ పింఛను పునరుద్ధరించాలని అధికారికంగా మళ్లీ విశ్వవిద్యాలయానికి లేఖ రాశా. స్వరం మార్చిన యార్లగడ్డ అని మీడియాలో వార్త వచ్చింది. నా స్వరం మారలేదు, రాజీనామాపై వెనకడుగు వేసే ప్రశ్నేలేదు. రాజకీయాలు మాట్లాడను. తెలుగు భాష అభివృద్ధికోసం గతంలో మాదిరిగా పనిచేస్తూనే ఉంటా'' అని యార్లగడ్డ వివరించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)