యాడికి అంగన్ వాడీలో కాలం చెల్లిన ఆహారం పంపిణీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా యాడికి 15వ వార్డు అంగన్ వాడీ కేంద్రంలో కాలం చెల్లిన పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారని , అంగన్ వాడీ కార్యకర్త విధులకు సరిగా హాజరు కావడం లేదని తహశీల్దారు  అలెగ్జాండర్ కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. అంగన్ వాడీ టీచర్ లక్ష్మీనారాయణమ్మ సరిగా విధులకు రావడంలేదని, ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న పౌష్టికాహారం చిన్నారులకు, గర్భవతులకు, బాలింతలకు సక్రమంగా అందజేయకుండా కాలం చెల్లిపోయిన తర్వాత పంపిణీ చేసిందన్నారు. మధ్యాహ్నం అంగన్ వాడీ సెంటర్లో పూర్తిస్థాయిలో ఆహారం తయారు చేయకుండా తక్కువ మోతాదులో తయారుచేసి ఎక్కువ మందికి పంపిణీ చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతోందని అంగన్ వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి స్టాకు సరిగా రావడం లేదని వచ్చిన స్టాక్ ను అంగన్ వాడి కేంద్రం పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని అంగన్ వాడీ కార్యకర్త లక్ష్మీనారాయణమ్మ చెబుతున్నారు. తమకు కూరగాయల బిల్లు, గ్యాస్ బిల్లులు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదని అంగన్ వాడీ కార్యకర్త తెలిపారు. ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తాహసిల్దార్ అలెగ్జాండర్ లబ్ధిదారులకు తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)