పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా!

Telugu Lo Computer
0


ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. చేనేత వస్త్రాలతో రూపొందించిన చొక్కా ధరించి బాలినేని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విటర్ వేదికగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన చేనేత సవాల్ ను స్వీకరించాను. నేను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా వైఎస్ ప్రభుత్వంలో పని చేశాను. ఆనాడు వైఎస్సార్ రూ. 300 కోట్లు చేనేతల కోసం రుణమాఫీ చేశారు. ఇవాళ మా నాయకుడు జగన్ ప్రభుత్వంలోనూ నేతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్ నేస్తం దగ్గర నుంచి ఎన్నో పథకాలు అందిస్తున్నాం. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమంకోసం, వారి అభివృద్ధికోసం నిజాయితీతో పని చేస్తున్నాం. అందరూ చేనేత వస్త్రాలు ధరించండి అంటూ పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)