కన్నకూతుర్ని ఆటో తో తొక్కించి చంపడానికి యత్నంచిన తండ్రి

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని భరత్ పూర్ లో నగ్మా అనే యువతి అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం కాస్త ఇంట్లో తెలిసింది. వెర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. అయితే.. నగ్మా ఇంట్లో నుంచి పారిపోయి నరేంద్రను ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది. అప్పుడు నగ్మా తండ్రి.. ఇస్లాంఖాన్.. తన కూతురుని మోసం చేసి పెళ్లిచేసుకున్నారని.. నరేంద్రపై కేసు పెట్టాడు.దీంతో మధ్యప్రదేశ్ కు వెళ్లి కొన్నినెలల పాటు ఉన్నారు. అక్కడ ఆమె గర్భవతి అయ్యిది. ఆ తర్వాత.. తిరిగి భరత్ పూర్ కు వచ్చి కాపురం పెట్టారు. అప్పటి నుంచి నగ్మా తండ్రి అదను కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో.. రోటిన్ చెకప్ లో భాగంగా నరేంద్ర, నగ్మా ఆస్పత్రికి వెళ్తున్నారు. అప్పుడు నగ్మా తండ్రి ఆటోలో.. రోడ్డుపై వీరిద్దరు నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశాడు. వెంటనే వేగంగా వచ్చి ఇద్దరికి గుద్దడానికి యత్నించాడు. ఆటోను గమనించిన నరేంద్ర, నగ్మా లు అక్కడి నుంచి పారిపోయారు రోడ్డు మీద జనాలు గుమిగూడటంతో ఇస్లాంఖాన్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఇది  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)