ఉద్యోగాల పేరిట టోకరా ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 6 August 2022

ఉద్యోగాల పేరిట టోకరా !


తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ లీడర్‌గా ఓ గ్యాంగ్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈజీగా మనీ సంపాదించాలనే దురుద్ధేశంతో పథకం వేశారు. అలా ఆలోచించడమే ఆలస్యం.. ప్లాన్‌ను అమలు చేశారు. ముంబై కంపెనీ పేరుతో ఉద్యోగాలిప్పిస్తామని ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనను నమ్మిన నిరుద్యోగులు చాలా మంది కొంత మొత్తం డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అలా కోట్లలో డబ్బులు వసూలైంది. అనంతరం ఆ చీటర్స్ ఉడాయించారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోవిల్‌లో ఆన్‌లైన్ చీటింగ్‌కు పాల్పడిన ప్రిన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఇతనే కీలక వ్యక్తిగా గుర్తించారు అధికారులు. కోట్లలో నగదు తీసుకుని చీటింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో మిగతావారు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంతటి మోసానికి పాల్పడటం చూసి అధికారులే అవాక్కయ్యారు.

No comments:

Post a Comment