ఈజిప్టులో బయటపడ్డ ప్రాచీన సూర్యదేవాలయం

Telugu Lo Computer
0


ఈజిప్టు లో అత్యంత ప్రాచీన సూర్యదేవాలయం తవ్వకాల్లో బయటపడింది. అబూసిర్ ప్రాంతంలో ఇటలీ, పోలెండ్ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపగా దేవాలయ నిర్మాణాలు వెలుగుచూశాయి. ఈ దేవాలయం క్రీస్తు పూర్వం 2465 - 2323 (సుమారు 4500 ఏళ్ల నాటిది) ఈ ఆలయాన్ని నుసెర్రే అనే రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఫారో చక్రవర్తులు పరిపాలించిన ఈజిప్టులో సూర్యోపాసన చేశారనడానికి ఈ ఆలయం నిదర్శనంగా చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. తవ్వకాల్లో ఆలయంతో పాటు గ్లాసులు, పాత్రలు తదితర వస్తువులు బయటపడగా ఈ మేరకు ఈజిప్టు కళాఖండాలు, పర్యాటక మంత్రిత్వ శాఖ జులై 31న ప్రకటన చేసింది. కాగా, చరిత్ర ప్రకారం చూస్తే ఈజిప్టు ప్రజలు 'రా' అనే సూర్యదేవతను పూజించేవారు. గతంలో డేగ తలతో ఉన్న రా చిత్రాలు అనేకం వెలుగు చూడడం గమనార్హం.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)