లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఒడిదొడుకుల మధ్య సూచీలు కొనసాగగా, చివరి సెషల్‌లో పుంజుకోవడంతో లాభాలను నమోదు చేశాయి. చైనా – తైవాన్‌ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు, కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. చివరి సెషన్‌లో కొనుగోళ్ల మద్దతుతో కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 214.17 పాయింట్లు పెరిగి.. 58,350.53 వద్ద, నిఫ్టీ 42.70శాతం పెరిగి 17,388.20 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. 1,337 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 1934 షేర్లు క్షీణించించగా.. 133 షేర్లు మారలేదు. నిఫ్టీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కోల్ ఇండియా నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం మేర క్షీణించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)