ట్రాఫిక్ సీఐ ఓవరాక్షన్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మియాపూర్‌ ప్రాంతంతో అధికారులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్‌ సీఐ అతిగా ప్రవర్తించారు. చేతిలో అధికారం ఉంది కదాని ఓ వాహనదారుడిపై ట్రాఫిక్‌ సీఐ సుమన్‌ చేయిచేసుకున్నారు. వాహనదారుడిని తిట్టుకుంటూ కాలర్‌ పట్టుకొని లాక్కెళ్లి మరీ కొట్టాడు సీఐ. అయితే ట్రాఫిక్‌ అధికారులకు కొట్టే అధికారం లేదని తప్పుచేస్తే కేసు నమోదు చేయాలని బాధితుడు చెపుతున్నా వినకుండా.. నాకే ఎదురు చెపుతావా..? అంటూ రెచ్చిపోయాడు మియాపూర్‌ ట్రాఫిక్‌ సీఐ సుమన్‌. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. సీ.ఐపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)