మొక్కజొన్నతో లెబనాన్ కు బయలుదేరిన ఉక్రెయిన్ నౌక

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌లో పండిన మొక్కొజొన్నలను ఇవాళ భారీ రవాణా నౌకలో తరలించారు. రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఉక్రెయిన్ నుంచి ఆహార రవాణా నౌకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడింది. అయితే ఇవాళ ఒడిసా తీరం నుంచి తొలి షిప్మెంట్ జరిగింది. సియెరా లియోన్‌కు చెందిన రజోనీ కార్గో షిప్‌లో మొక్కొజొన్నను తరలిస్తున్నారు. లెబనాన్‌కు ఆ కార్న్ గింజల్ని తరలిస్తున్నట్లు తెలిపారు. రజోని నౌకలో సుమారు 26 వేల టన్నుల మొక్కొజొన్న ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూలై 22వ తేదీన కుదిరిన ఒప్పందం ప్రకారమే ఉక్రెయిన్ తీరాల నుంచి ఆహార ధాన్యాలను తరలిస్తున్నారు. తొలుత మంగళవారం ఇస్తాంబుల్‌కు ఆ నౌక చేరుకుంటుంది. అక్కడ తనిఖీ ముగిసిన తర్వాత ఆ నౌక లెబనాన్ వెళ్తుందన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)