ప్రతిభను నమ్ముకొని పరిశ్రమలోకి వచ్చా ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 August 2022

ప్రతిభను నమ్ముకొని పరిశ్రమలోకి వచ్చా !


వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన సాయి పల్లవి.. కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులు చవిచూస్తోంది. నటన పరంగా ఫుల్ మార్కులు కొట్టేస్తోంది కానీ, సినిమాలతోనే మెప్పించలేకపోతోంది. ఒకప్పుడు సాయి పల్లవి ఏది టచ్ చేస్తే అది హిట్ అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రతీదీ ఫ్లాప్ అవుతోంది. రీసెంట్‌గా వచ్చిన విరాటపర్వం, గార్గి చిత్రాలు సైతం ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి కొన్ని విషయాల్లో తనని తాను మార్చుకోవాల్సి ఉంటుందని నిర్మాతలు సూచించారట ! ఇన్నాళ్లు చేసిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్ని కాస్త పక్కన పెట్టి, గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న కమర్షియల్ సినిమాలు చేయమని ఆమెకు చెప్పారట ! ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్లుగా చెలామణీ అవుతోన్న భామలందరూ, ఈ గ్లామర్ షోనే అస్త్రంగా మలుచుకున్నారన్న సాకు చూపిస్తున్నారట! ఇందుకు సాయి పల్లవి కూడా అంతే ఘాటుగా బదులిచ్చినట్టు వార్తలొస్తున్నాయి. తనకు ఆఫర్స్ రాకపోతే.. క్లినిక్ పెట్టుకోవడమో లేక ఉద్యోగం చేయడమో చేస్తానే గానీ, గ్లామర్ షో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని తెగేసి చెప్పిందట! తన ప్రతిభను నమ్ముకొని తాను పరిశ్రమలోకి వచ్చానని, గ్లామర్ షో చేయడం కాదు కదా, దాని గురించి కనీసం ఆలోచించను కూడా అని ఈ నేచురల్ బ్యూటీ ఖరాఖండీగా చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.

No comments:

Post a Comment