తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 July 2022

తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య


దేశవ్యాప్తంగా ఓ వైపు రెగ్యులర్ కోర్సులు చేస్తూనే, డ్యూయెల్ డిగ్రీ కింద స్వయం కోర్సులు చేయాలని ఆసక్తిగా ఉన్న విద్యార్ధినీ, విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఓ  విషయాన్ని తెలియజేసింది. తక్కువ ఖర్చులోనే ఉన్నత విద్యను అందిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సులను ఆయా విశ్వవిద్యాలయ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రారంభించేలా, తాజాగా అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. "యూనివర్సిటీలతోపాటు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు 'మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు' (మూక్స్) కింద స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్ (స్వయం) ద్వారా ఈ కోర్సులను రూపకల్పన చేసింది. ఈ కోర్సులను 40 శాతం ఆన్లైన్లోనే అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను సమర్పించాలని పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్లైన్ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మూక్స్ వేదికను ఏర్పాటు చేసింది." ఈ కోర్సులు ఆల్‌లైన్ కోర్సులని అధికారులు పేర్కొన్నారు. ఈ కోర్సులు అనేవి కరోనా వంటి మరే ఇతర విపత్కర పరిస్థితులు వచ్చిన విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం "స్వయం' ద్వారా వివిధ ఆన్లైన్ కోర్సులకు రూప కల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా 'స్వయం' ద్వారా ఆన్లైన్ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో 'స్వయం' కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సులు ఏంటీ? ఏ విధంగా కోర్సుల్లో జాయిన్ అవ్వాలి ? అనే పూర్తి వివరాల కోసం యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment