రేషన్‌ బియ్యం పట్టివేత

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ సర్కిల్‌ పోలీసులు సంయుక్తంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ రఘు తెలిపారు. పట్టణంలోని గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం సీఐ భూపతితో కలిసి సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌, నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ నుంచి గుజరాత్‌ రాష్ట్రానికి మూడు లారీల్లో 56 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. బియ్యాన్ని హైదరాబాద్‌- ముంబయి 65వ నంబర్‌ జాతీయ రహదారిపైగల జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి కూడలి, అల్గోల్‌ బైపాస్‌ జంక్షన్‌, చిరాగ్‌పల్లి చెక్‌ పోస్టు.. ఇలా మూడుచోట్ల తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చోదకులు కర్ణాటకలోని బీదర్‌ జిల్లా చట్‌నెల్లికి చెందిన షేఖ్‌ హుస్సేన్‌, కాంబ్లే జైభీమ్‌, మహ్మద్‌ నూర్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బియ్యం యజమానులు బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌కు చెందిన రహీమ్‌ఖాన్‌, మహ్మద్‌ నూర్‌, షేఖ్‌ మిష్రాన్‌ పరారీలో ఉన్నారన్నారు. లారీలను జప్తు చేసి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఏకకాలంలో దాడులు చేసి పట్టుకున్న జహీరాబాద్‌ పట్టణ, గ్రామీణ, చిరాగ్‌పల్లి ఎస్‌ఐలు శ్రీకాంత్‌, పరమేశ్వర్‌, కాశీనాథ్‌ సహా సిబ్బందిని అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)