మహిళా ఎస్ఐ దారుణ హత్య

Telugu Lo Computer
0


జార్ఖండ్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, సబ్ ఇన్‌స్పెక్టర్ సంధ్య టోప్నో రాంచీలోని టుపుడన ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒడిశా నుంచి ఓ లారీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ లారీ రెండు చోట్ల గస్తీ బృందాల నిఘాను తప్పించుకోగలిగింది. చివరికి రాంచీ చేరుకుంది. సంధ్య టోప్నో ఆ లారీని ఆపాలని సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ లారీని ఆపకుండా ఆమె పై నుంచి దూసుకెళ్ళేలా దాని డ్రైవర్ నడిపించాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దానిని గమనించిన మిగిలిన పోలీసులు ఆ లారీని వెంబడించారు. వేగంగా వెళ్తున్న ఆ లారీ ప్రమాదానికి గురై, బోల్తా పడింది. దానిని నడుపుతున్న నిసార్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరొక వ్యక్తి తప్పించుకున్నాడు. రాంచీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కౌశల్ కిషోర్ మాట్లాడుతూ, లారీని జప్తు చేశామని, దానిలోని 10 ఆవులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నదీ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రాంచీ పోలీసు సంఘం ప్రతినిధి ఆనంద్ ఖల్కో మాట్లాడుతూ. సంధ్య టోప్నో నిజాయితీగా తన కర్తవ్యాన్ని నిర్వహించేవారని, సమర్థతగల అధికారిణి అని చెప్పారు. ఆమె మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని, ఓ దృష్టాంతంగా నిలిచేవిధంగా ఆ శిక్ష ఉండాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)