ర్యాష్‌గా డ్రైవింగ్ చేయొద్దు అన్నందుకు రోడ్డుపై బస్సు వదలి వెళ్లిన డ్రైవర్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప డిపో నుంచి బెంగుళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవారం రాత్రి 11 గంటలకు 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బస్సు డ్రైవర్ ర్యాష్‌గా డ్రైవింగ్ చేయటం మొదలు పెట్టాడు. దాంతో ప్రయాణికులు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురై, ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్లి పలువురు ప్రయాణికులు మందలించారు. ఇక అంతే, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపం దగ్గరికి రాగానే, బస్సును రోడ్డుపైనే వదిలేసి, ఆ డ్రైవర్ పరారయ్యాడు. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతూ, డ్రైవర్ కోసం గంటల కొద్ది వేచి చూశారు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మరో డ్రైవర్‌ను పంపడంతో ప్రయాణికులు గమ్యస్థానం చేరుకున్నారు. అనంతరం ప్రయాణికుల ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. ఆ డ్రైవర్ ఎందుకిలా చేశాడో తెలుసుకుంటామని, అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ కోసం అధికారులు గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)