బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 22 July 2022

బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ?


కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్‌షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని ఉన్నత వర్గాల సమాచారం. వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశానికి జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్‌ దూబే  మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా అమిత్‌షా ఆహ్వానించినట్టు తెలిసింది. దీనికి రాజగోపాల్‌రెడ్డి సైతం దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం. వ్యాపారవేత్తలైన రాజగోపాల్‌రెడ్డి, నిషికాంత్‌ దూబే మధ్య కొన్నేండ్లుగా సాన్నిహిత్యం ఉన్నదని, రాజగోపాల్‌రెడ్డి జార్ఖండ్‌లో కాంట్రాక్ట్‌లు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ స్నేహంతోనే ఈ భేటీకి దూబే మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తున్నది.

No comments:

Post a Comment