లంచం తీసుకుంటూ చిక్కిన లేడీ ఎస్ఐ

Telugu Lo Computer
0


బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)లోని బీఎంటీఎఫ్ విభాగం బెంగళూరు నగరంలోని ఆస్తులకు సంబంధించి నమోదు అయిన కేసుల దర్యాప్తు చేస్తోంది. బెంగళూరు పరిధిలోని ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం బీఎంటీఎఫ్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బీఎంటీఎఫ్ లో బేబీ ఓలేకార అనే మహిళ లేడీ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని హోరమావులోని సర్వే నెంబర్ 153లోని బెన్సన్ టౌన్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణం విషయంలో అడ్డుపడటంతో 2019లో తం వివాదం మొదలు కావడంతో బీఎంటీఎఫ్ కేసు నమోదు చేసింది. రెండు సంవత్సరాల క్రితం హోరమావులోని స్థలం వివాదం పరిష్కారం అయయింది. హోరమావు స్థలం విషయంలో నమోదు అయిన కేసును రెండు సంవత్సరాల క్రితమే బీఎంటీఎఫ్ అధికారులు క్లోజ్ చేశారు. ఇటీవల ఓ వ్యక్తికి ఫోన్ చేసిన లేడీ ఎస్ఐ బేబీ ఓలేకార మీ కేసు వివాదం పెండింగ్ లో ఉందని చెప్పారు. లేదు మేడమ్ కొన్ని సంవత్సరాల క్రితమే ఆ కేసు వివాదం పరిష్కారం అయ్యిందని ఆయన లేడీ ఎస్ఐ బేబీ ఓలేకారకు చెప్పారు. మీరు మా ఆఫీసుకు రండి, మాట్లాడుకుందాము అని లేడీ ఎస్ఐ బేబీ ఒలేకార చెప్పారు. కేసు క్లోజ్ చెయ్యాలంటే రూ. 3 లక్షలు ఖర్చు అవుతోందని లేడీ ఎస్ఐ బేడీ ఒలేకార డిమాండ్ చేశారు. తరువాత ఇద్దరి మద్య కొన్నిసార్లు చర్చలు జరిగాయి. కేసు పరిష్కారం చెయ్యడానికి చివరికి లేడీ ఎస్ఐ బేబీ ఒలేకారతో రూ. 1 లక్షకు డీల్ కుదిరింది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ బేబీ ఒలేకార తనను లంచంతీసుకోవాలని చెప్పారని కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. లేడీ ఎస్ఐ బేబీ ఒలేకారను ఏసీబీ అధికారులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ కార్పోరేటర్ లక్ష్మి నారాయణ సోదరుడితనే లేడీ ఎస్ఐ రూ. 1 లక్ష డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడం బెంగళూరులో కలకలం రేపింది

Post a Comment

0Comments

Post a Comment (0)