షింజో అబేపై దాడిని ఖండించిన మోడీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 July 2022

షింజో అబేపై దాడిని ఖండించిన మోడీ


జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని ఖండిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. తామంతా అతని కుటుంబంతో..జపాన్ ప్రజలతో ఉన్నాం'' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపైకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షింజో అబే నరేంద్రమోదీకి మిత్రుడు. గత ఏడాది షింజోను  భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఈ ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత  స్నేహం కూడా ఉంది. షింజో అబే ప్రధాన మంత్రిగా భారత దేశానికి వచ్చినప్పుడు షింజో అబే వారణాసి దర్శనానికి ప్రధాని మోడీ తీసుకెళ్లారు. ఇద్దరు దేశాధినేతలు కలిసి గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సమయంలో భారతీయ సంస్కృతి, నాగరికత పట్ల షింజో అబే తన ఆప్యాయత వెల్లడించారు. షింజో అబే భారతీయ సంప్రదాయాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుల్లో నరేంద్ర మోదీ ఒకరు అని గతంలో చాలాసార్లు జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించిన సంగతి తెలిసిందే. షింజో అబే భారతదేశం నుంచి బయలుదేరుతూ.. తనకు మంచి స్నేహితుడు అంటే ప్రధాని మోదీ అని అన్నారు. ఈ సందర్భంలో షింబో అబేకు ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను అందించారు. అంతేకాదు ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కూడా అనేకసార్లు జపాన్ కు వెళ్లారు. అబేతో పలు చర్చలు జరిపారు. ఆ తరువాత అదే స్నేహాన్ని కొనసాగించారు. మోడీ ప్రధాని అయిన తరువాత కూడా అబే భారత్ తో మరింత సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అలా ఆ బంధం ఎప్పటికి ఉంటుందని ఇరువురు వెల్లడించుకునేవారు. జపాన్‌లో ఎగువ సభకు మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరాలో షింజో అబే ప్రచారం చేస్తున్న సమయంలో ఓ దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇలాంటి సమయంలో మాజీ ప్రధానిపై కాల్పులకు దిగడం కలకలం రేపింది. జపాన్‌లో అత్యంత తుపాకీ నియంత్రణ చట్టాలున్నాయి. జపాన్ లో తుపాకీ లైసెన్స్ పొందాలంటే చాలా చాలా కష్టతరం. దీంట్లో భాగంగా మొదట షూటింగ్ అసోసియేషన్ నుంచి సిఫారసును పొందాలి. ఆ తర్వాత పోలీసులు కఠినమైన నిబంధనలను దాటుకొని తుపాకీ లైసెన్స్ ను పొందుతారు. కానీ సదరు దుండగుడికి తుపాకీ ఎక్కడనుంచి వచ్చింది? కాల్పులకు గల కారణాలు ఏమిటి?అనే పలు కీలక అంశాలపై దర్యాప్తు సాగుతోంది అబేను నారాలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కాల్పులు జరిగాయి. షూటర్‌గా భావిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది" అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో చెప్పారు.

No comments:

Post a Comment