డ్రగ్స్‌కు బానిసైన కొడుకుని ముక్కలుగా నరికి చంపిన తండ్రి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 July 2022

డ్రగ్స్‌కు బానిసైన కొడుకుని ముక్కలుగా నరికి చంపిన తండ్రి !


గుజరాత్ లోని అహ్మదాబాద్ పరిధిలో స్వయం జోషి అనే 21 ఏళ్ల యువకుడు మద్యానికి, డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. రోజూ తాగి, డ్రగ్స్ తీసుకుంటూ ఉండేవాడు. వీటి ఖర్చుల కోసం డబ్బులు కావాలని తండ్రిని వేధించేవాడు. ఈ విషయంలో తండ్రి నిలేష్‌కు, కొడుకు స్వయం జోషికి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తండ్రి ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో ఈ నెల 18న కూడా మద్యానికి డబ్బులు కావాలని స్వయం జోషి, తండ్రిని అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించాడు. ఇది ఇద్దరి మధ్యా వాగ్వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన తండ్రి, కొడుకు స్వయం జోషిపై వంట గదిలో వాడే ఒక రాయి తీసుకుని దాడి చేశాడు. దీంతో కొడుకు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. దొరికిపోతానని భావించిన తండ్రి, బయటకు వెళ్లి ఒక పెద్ద ఎలక్ట్రిక్ గ్రైండర్, కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ కొనుక్కొచ్చాడు. తర్వాత కొడుకు మృతదేహాన్ని బాత్ రూమ్ తీసుకెళ్లి, అక్కడ గ్రైండర్‌లో ఆరు ముక్కలుగా కోశాడు. ఆరు ముక్కల్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. అహ్మదాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో శరీర భాగాలు వదిలేసి వచ్చాడు. ఆరు భాగాల్ని ఆరు చోట్ల వదిలిపెట్టాడు. తర్వాత గోరఖ్‌పూర్ వెళ్లి, అక్కడ్నుంచి నేపాల్ పారిపోవాలనుకున్నాడు. ఈ క్రమంలో స్వయం జోషి శరీర భాగాలు రెండు చోట్ల దొరికాయి. వీటి సమాచారం అందుకున్న పోలీసులు, శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు. ఆ శరీర భాగాలు ఒక్క వ్యక్తివే అని, అవి స్వయం జోషి అనే యువకుడికి సంబంధించినవి అని గుర్తించారు. ఈ క్రమంలో అనేక కోణాల్లో విచారణ జరుపగా, తండ్రిపై అనుమానం వచ్చింది. అతడు సూరత్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం ఒప్పుకున్నాడు. తన కొడుకు మద్యానికి బానిస అవ్వడం వల్లే గొడవ జరిగిందని, ఈ క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడని, తప్పించుకునేందుకే ఇదంతా చేశానని చెప్పాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి, అనంతరం జైలుకు తరలించారు.

No comments:

Post a Comment