ప్రధాని తో పాటు హెలికాప్టర్ లో జగన్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 July 2022

ప్రధాని తో పాటు హెలికాప్టర్ లో జగన్ !


ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్.. సీఎం జగన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో ప్రధాని భీమవరం చేరుకున్నారు.ప్రధానితో పాటుగా అదే హెలికాప్టర్ లో సీఎం జగన్ కూడా ప్రయాణించారు.  ఇప్పుడు ఇది ఆసక్తి కర అంశంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రానికి ప్రధాని వస్తే సీఎం స్వాగతం పలకటం ఆనవాయితీ. అదే ప్రకారం స్వాగతం పలికారు. కానీ, ప్రధానితోనే సీఎం సైతం అదే హెలికాప్టర్ లో భీమవరం వెళ్లటమే ఇప్పుడు చర్చకు కారణమైంది. సీఎం కాకముందు నుంచే జగన్ కు  ప్రధాని మోదీ తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు మరింత బలోపేతం అయ్యాయి. 2024 ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. ప్రధాని - ముఖ్యమంత్రి సాన్నిహిత్యం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. గన్నవరం వేదికగా వారిద్దరి ఆప్యాయతలు సైతం పొలటికల్ సర్కిల్స్ గమనించాయి. రాష్ట్రంలో బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ, పొత్తు కుదరిన సమయం నుంచి ఇప్పటి వరకు జనసేనాని ప్రధానితో కలిసిన సందర్బం లేదు. ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి వస్తున్నా..కలిసేందుకు ప్రయత్నించ లేదు. కార్యక్రమానికి ఆహ్వానం అందినా.. హాజరు కావటం లేదు. అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి.. స్థానికుడు అనే హోదాలో చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రధాని ఆశీసునులైన వేదిక మీదే చిరంజీవికి స్థానం కల్పించారు. బీజేపీతో కలిసే ఉన్నా.. జనసేన కొంత దూరంగానే ఉంది. కానీ, ప్రధాని పైన ప్రశంసలు కురిపించే పవన్ కళ్యాణ్.. ఆయన రాష్ట్రానికి వస్తుంటే ఎందుకు కలవలేదనే చర్చ సైతం ఇప్పుడు మొదలైంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటుగా బీజేపీతోనూ కలిసి వస్తే పొత్తు కుదుర్చుకొనే ప్రనయత్నాల్లో ఉన్నారు. కానీ, బీజేపీ నుంచి సానుకూల స్పందన ఇప్పటి వరకు రాలేదు. సరిగ్గా..ఇదే జగన్ సైతం కోరుకుంటోంది. ఓట్ల పరంగా రాష్ట్రంలో బీజేపీ బలం ఎలా ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉండటం కీలకమైన అంశం.


No comments:

Post a Comment