హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల కోసమే ధరణి పోర్టల్ !

Telugu Lo Computer
0


ముఖ్యమంత్రి కేసీఆర్ రాజు అని గడీల నుంచి బయటకు రాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని విమర్శించాడు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని, నమోదైన వాటిలో 50 శాతం తప్పులే ఉన్నాయని అన్నారు. . ధరణి అనేది గొప్ప పోర్టల్ అని చెబుతున్నాడని.. సీఎంది నోరా మోరా అని విమర్శించారు. ధరణితో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టాడని విమర్శించారు. ప్రజలకు, మీ మధ్యలో అధికారులు ఇబ్బంది పడుతున్నారని.. అధికారులకు అధికారాలు ఇవ్వాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం ఇస్తారని ఆయన అన్నారు. నీ భాష, వ్యవహార శైలి, నీ భయం చూశాక నీకు ఎవ్వరూ ఓటు వేయరని అన్నారు. రాష్ట్రములో ఏ సమస్య వచ్చినా కుర్చీ వేసుకుని తీరుస్తా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలా చేయడం లేదని అన్నారు. పేద ప్రజలు, అడవి బిడ్డలపై సీఎం కేసీఆర్ దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. 2018 ఎన్నికల్లో పోడు భూముల వ్యవహారం తేలుస్తా అని చెప్పాడని.. అన్ని ఎన్నికల సందర్భంగా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. హైదరాబాద్ చుట్టూ భూములు సాధించేందుకే ధరణి తీసుకువచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)