నారాయణ కాలేజీలో ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు

Telugu Lo Computer
0


నారాయణ విద్యా సంస్థలు ఆకర్షణీయమైన కాలేజీలను చూపించి, అడ్మిషన్లు తీసుకుని, విద్యార్థినిలు చేరిన అనంతరం వారిని సుదూర ప్రాంతానికి తరలించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి, కనీస సౌకర్యాలు లేని ప్రాంతానికి మార్పించారు. విద్యార్థులు ఉండే గదుల్లోకి తేళ్లు వస్తుండటంతో భయంతో వణుకుతున్నారు. దీంతో దాదాపు 250 మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కుంట్లూరు నారాయణ కాలేజీలో ఆందోళనకు దిగారు. అడ్మిషన్​ పొందిన కాలేజీలోనే తమ పిల్లలను ఉంచాలంటూ నిరసనకు దిగారు. కాలేజీ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కాలేజీ ముందు బైఠాయించారు. చివరకు విద్యార్థుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా కంప్లైట్​ ఇచ్చారు. శనివారం వరకు విద్యార్థినులను తిరిగి పాత క్యాంపస్​ కు తీసుకురావాలన్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. ఈ ఆందోళనతో దాదాపు నాలుగు గంటలు కుంట్లూరు నారాయణ క్యాంపస్​ లో ఉత్కంఠ నెలకొంది. కాలేజీ యాజమాన్యం తీరుకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)