ఎస్‌బీఐలో కస్టమర్ ఛార్జీలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 July 2022

ఎస్‌బీఐలో కస్టమర్ ఛార్జీలు !


బ్యాంక్ లో కస్టమర్ ఓపెన్ చేసే అకౌంట్‌కు కొన్ని సేవలు మాత్రమే ఉచితంగా లభిస్తాయి. కొన్ని సేవలకు ఫ్రీ లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటితే ఛార్జీలు చెల్లించాలి. ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా 45 కోట్లకు పైగా అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. నిత్యం కోట్లాది మంది అకౌంట్‌ హోల్డర్లు ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు పొందుతున్నారు. అయితే ఎస్‌బీఐ వసూలు చేసే ఛార్జీల గురించి అవగాహన లేక కస్టమర్లు పలుమార్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌బీఐ 2020 మార్చిలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది. గతంలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 మధ్య ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఏటీఎంలో జరిపే లావాదేవీలకు ఛార్జీలు ఉంటాయి. అయితే ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,00,000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే ఎలాంటి లిమిట్ లేదు. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,00,000 లోపు మెయింటైన్ చేసేవారు ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. మెట్రో నగరాల్లోని ఇతర ఏటీఎంలల్లో మూడు  ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇతర ప్రాంతాల్లోని ఏటీఎంలల్లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. లిమిట్ దాటిన తర్వాత మెట్రో నగరాల్లో ప్రతీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20 + జీఎస్‌టీ, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8 + జీఎస్‌టీ, ఇతర ప్రాంతాల్లో ప్రతీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.10 + జీఎస్‌టీ, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 + జీఎస్‌టీ సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. కౌంట్ హోల్డర్స్ బ్యాంకులో, బ్యాంక్ బ్రాంచ్‌లల్లో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత రూ.15 + జీఎస్‌టీ చెల్లించాలి. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా. ఆ తర్వాత 10 చెక్స్ ఉన్న చెక్ బుక్ కావాలంటే రూ.40 + జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ కావాలంటే రూ.75 + జీఎస్‌టీ చెల్లించాలి. ఎమర్జెన్సీ చెక్ బుక్స్ కోసం 10 చెక్స్ ఉన్న చెక్ బుక్ కావాలంటే రూ.50 + జీఎస్‌టీ చెల్లించాలి.

No comments:

Post a Comment