రీ పోస్ట్‌మార్టంకు మద్రాస్ హైకోర్టు ఆదేశం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 July 2022

రీ పోస్ట్‌మార్టంకు మద్రాస్ హైకోర్టు ఆదేశం


తమిళనాడులో పన్నెండో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలిక రాసిన సూసైడ్ నోట్ కీలకంగా మారింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి స్టాలిన్ సీరియస్‌గా తీసుకోవడంతో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. చెన్నై సమీపంలోని కళ్ళకూరుచిలో బాలిక ఆత్మహత్య ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న సేలం గ్రామానికి చెందిన శ్రీమది, ఓ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతూ హాస్టల్‌లోనే ఉంటోంది. హాస్టల్‌ భవనం మీద నుంచి దూకి శ్రీమది ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల తర్వాత సూసైడ్ నోట్ దొరికింది. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో రాసింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థినులపై దాడులను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థిని మృతదేహానికి రీ- పోస్ట్‌మార్టం చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనలో పాల్గొన్న 108 మందికి 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు విచారించారు. బాలిక మృతికి ఆ స్కూల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ వారితో కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. విద్యాసంస్థకు సంబంధించిన బస్సులతో పాటు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. 


No comments:

Post a Comment