పాము మింగిన కోడిగుడ్లను తీసిన రైతు !

Telugu Lo Computer
0


శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సరిహద్దు గ్రామమైన కోనయ్యపాలెంలో  వింత చోటు చేసుకుంది. నర్సింగరావు చౌదరి సాధారణ రైతు. ఇంటి వద్దే మేలుజాతి కోళ్లను పెంచుతుంటాడు. వాటి గుడ్లను, కోడి పిల్లలను విక్రయిస్తుంటారు. ఇటీవల ఆయన పెంచుతున్న కోళ్లపై ఓ నాగుపాము కన్నేసింది. కోళ్లను చంపడంతో పాటు గుడ్లను మింగేస్తోంది. మేలుజాతి కావడంతో గుడ్లకు భలే డిమాండ్‌. ఒక్కో గుడ్డు రూ.1,000 పైమాటే. సోమవారం పాము రావడాన్ని గుర్తించిన నర్సింగరావు చౌదరి దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అప్పటికే అది ఐదు కోడి గుడ్లు మింగినట్లు గుర్తించాడు. జాగ్రత్తగా వాటిని బయటకు తీసి మరో కోడి వద్ద అటికించేందుకు పెట్టాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఇదే విషయంపై నర్సింగరావు చౌదరిని ప్రశ్నించగా తమ పూర్వీకుల కాలం నుంచి పాములు పట్టడంలో ప్రావీణ్యం ఉందన్నారు. కోడిగుడ్ల విలువ అధికంగా ఉండడంతో ప్రమాదమైనా తప్పనిసరి పరిస్థితుల్లో నాగుపాము కడుపు నుంచి వాటిని బయటకు తీసినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)