తగ్గిన వంటనూనె ధరలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 July 2022

తగ్గిన వంటనూనె ధరలు


దిగుమతి చేసుకున్న వంట నూనెల గరిష్ట రిటైల్ ధరని వారంలోగా లీటరుకు రూ. 10 వరకు తగ్గించాలని ప్రభుత్వం వంట నూనె తయారీదారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే మథర్ డెయిరీ, పతంజలీ వంటి కంపెనీలు ధరలను తగ్గించగా, తాజాగా మరిన్ని దిగ్గజ బ్రాండెడ్ ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సైతం వంట నూనెల రిటైల్ ధరలను తగ్గించాయి. ప్రస్తుతం.. అదానీ విల్మార్, ఇమామి, జెమినీ వంటి చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. కొన్ని కంపెనీలు వంట నూనెలపై లీటరుకు రూ.15 నుంచి రూ.30 వరకు ధరను తగ్గించాయి. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ 1లీటర్ పౌచ్ రూ.210 నుంచి రూ.199కి తగ్గింది. ఫార్చ్యూన్ మస్టర్డ్ ఆయిల్ 1లీటర్ బాటిల్ ధర రూ.210 నుంచి రూ.190కి తగ్గింది. ఫార్చ్యూన్ వేరుశెనగ నూనె 1లీటర్ ప్యాకెట్ ధర రూ.220 నుంచి రూ.210కి తగ్గింది. ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ 1లీటర్ ప్యాకెట్ ధర రూ.225 నుంచి రూ.210కి తగ్గింది. రాగ్ వనస్పతి 1లీటర్ పౌచ్ ధర రూ.205 నుంచి రూ.185కి తగ్గింది. నెలాఖరు నాటికి పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని అదానీ విల్మార్ తెలిపింది. ఇమామీ సంస్థ ఉత్పత్తుల MRPలను తగ్గించినట్లుపేర్కొంది. ఎంఆర్పీని లీటరుకు రూ.35 వరకు తగ్గించడం ద్వారా కంపెనీ వినియోగదారులకు పెద్ద ఊరట కలిగిస్తోందని చెప్పుకోవాలి. వీటికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్లకు ధరలు కూడా తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సోయా 1లీటర్ పౌచ్ పై రూ.35 తగ్గటంతో రూ.215 నుంచి రూ.180 చేరుకుంది. కేజిఎంఒ 1లీటర్ పౌచ్ పై రూ.17 తగ్గటంతో రూ.215 నుంచి రూ.198 అందుబాటులో ఉంది. ఆర్బీ ఓ  1లీటర్ పౌచ్ ధర రూ.30 తగ్గటంతో రూ.220 నుంచి రూ.190కి చేరుకుంది. జెమిని కూడా తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. సన్‌ఫ్లవర్ 1లీటర్ పౌచ్ రూ.200 నుంచి రూ.192కి తగ్గింది. ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ 1లీటర్ పౌచ్ ధర రూ.190 నుంచి రూ.175కి వేరుశెనగ 1లీటర్ పౌచ్ ధర రూ.200 నుంచి రూ.185కి తగ్గింది. మస్టర్డ్ 1లీటర్ ప్యాకెట్ ధర రూ.215 నుంచి రూ.185కి, ఫస్ట్ క్లాస్ పామోలిన్ 1లీటర్ పౌచ్ ధర రూ.170 నుంచి రూ.150కి, ఫస్ట్ క్లాస్ లైట్ సూపరోలిన్ 1లీటర్ పౌచ్ రేటు రూ.180 నుంచి రూ.160కి తగ్గింది.


ధరల తగ్గుదల

మోడీ నేచురల్ కూడా ఆలివ్ ఆయిల్ ధరను లీటరుకు రూ.15-20 తగ్గించింది. ఈ నెల ప్రారంభంలో దిగుమతి చేసుకున్న వంట నూనెల గరిష్ఠ రిటైల్ ధర ఒక వారంలోగా లీటరుకు రూ. 10 వరకు తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులను ఆదేశించిందని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించడంతో దేశీయ కంపెనీలు ధరల తగ్గింపు ప్రారంభంచాయి. గ్లోబల్ కమోడిటీ ధరల తగ్గుదల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మరిన్ని కంపెనీలు వంట నూనెల ధరలను ప్రస్తుతం కంటే లీటరకు రూ.15 వరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment