విద్యార్థినిపై హెడ్మాస్టర్ అకృత్యం !

Telugu Lo Computer
0


తమిళనాడులోని ని వేలూరు జిల్లా పేర్నంబట్టు పంచాయతీలోని మాచంబట్టు గ్రామంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఉంది. అందులో పేర్నంబట్టు గ్రామం ఆలయ వీధికి చెందిన పాల్ వణ్ణన్ హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం 70 మంది పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు. పాల్ వణ్ణన్ తో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా స్కూల్ లో పని చేస్తున్నాడు. ఇలా ఉండగా విద్యార్ధులు మధ్యాహ్నం భోజనం చేయటానికి వెళుతుండగా పాల్ వణ్ణన్ 5వ తరగతి చదువుతున్న ఒక బాలికను తన గదిలోకి పిలిచి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఇదే పాఠశాలలో చదువుతున్న బాధితురాలి బంధువు అయిన మరో బాలిక చూసింది. దీంతో హెచ్ ఎం ఆ బాలికను కొట్టాడు. బాలికలిద్దరూ ఇంటికి వెళ్లగానే వారి  తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఉమరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాల్ వణ్ణన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)