నాగ చైతన్య - లక్ష్మి - నాగార్జున

Telugu Lo Computer
0


టాలీవుడ్‌ లో లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మి. ఈమె పుట్టే సమయానికి రామానాయుడు ఇంకా సినిమా రంగంలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేదు. 1965 సెప్టెంబర్ లో దగ్గుబాటి ఫ్యామిలీలో మహాలక్ష్మి గా ఆమె జన్మించారు. రామానాయుడు మొదటగా రాముడు భీముడు సినిమాను నిర్మించాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో రామానాయుడు భారీ చిత్రాల వైపు దృష్టి మరల్చాడు. ఆ సమయంలోనే అక్కినేని కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఒక హీరో నిర్మాతగా అని కాకుండా ఇరువురి ఫ్యామిలీల మద్య మంచి సన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఆ సన్నిహిత్యంతోనే రామా నాయుడు మరియు ఏయన్నార్‌ లు వీయ్యంకులు అవ్వాలని భావించారు. అందుకోసం నాగార్జున మరియు లక్ష్మిలకు వివాహం చేయాలని భావించారు. నాగార్జున అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తుండగా లక్ష్మి మాత్రం అమెరికాలో ఇంటీరియర్ డిజైనర్‌ గా వ్యవహరిస్తున్నారు. అమెరికా జీవన విధానానికి అలవాటు పడ్డ లక్ష్మి మళ్లీ ఇండియాకు వచ్చేందుకు ఆసక్తి చూపించ లేదు. తప్పని పరిస్థితుల్లో ఇండియాకు ఆమె తిరిగి వచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే నాగార్జునతో వివాహం జరిగింది. నాగార్జున మరియు లక్ష్మి  వివాహం చెన్నై లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అయిన కొన్ని నెలలకే వివాదం మొదలైంది. లక్ష్మి గారికి అమెరికా వెళ్లి అక్కడ తన కెరీర్‌ ను కంటిన్యూ చేయాలనే కోరిక ఉండేది. కాని నాగార్జున మాత్రం టాలీవుడ్ లో తాను ఒక స్టార్‌ హీరో కనుక అమెరికా వెళ్లే ఆలోచన చేయలేదు. అలా ఇద్దరి మద్య వివాదం జరుగుతున్నా కూడా రెండు కుటుంబాల వారు వారిని కలిపి ఉంచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. నాగ చైతన్య పుట్టిన తర్వాత ఇద్దరు కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చారు. లక్ష్మితో వివాదం సమయంలోనే నాగార్జునకు అమలతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో లక్ష్మి గారితో విడాకులు తీసుకున్న వెంటనే అమల మెడలో నాగార్జున తాలి కట్టి తన భార్యగా చేసుకున్నాడు. అమెరికా వెళ్లిన లక్ష్మి కూడా కొన్నాళ్లకు తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయ్యింది. కొడుకు నాగ చైతన్యను లక్ష్మి కొన్నాళ్లు తన వద్ద పెంచుకుంది. ఆ తర్వాత అక్కినేని మరియు దగ్గుబాటి కుటుంబం మద్య పెరిగాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)