మరో చపాతీ ఇవ్వలేదని హత్య !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో మున్నా (40) అనే రిక్షా కార్మికుడు గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో స్థానిక విష్ణు మందిర్ మార్గ్ దగ్గర హోటల్ నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్నాడు. అప్పుడే బాగా మద్యం తాగి ఉన్న ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఇవ్వాలి అని భోజనం చేస్తున్న మున్నాను అడిగాడు. అప్పుడు మున్నా ఒక చపాతి ఇచ్చాడు. అది తిన్న తర్వాత ఫిరోజ్ ఖాన్ మరో చపాతి అడిగాడు. దీనికి మున్నా నిరాకరించాడు. దీంతో మున్నాను తిడుతూ ఫిరోజ్ ఖాన్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో మున్నాను పొడిచాడు. దీంతో అక్కడే మున్నా కుప్పకూలిపోయాడు. తర్వాత ఫిరోజ్ ఖాన్ అక్కడ్నుంచి పారిపోయాడు. కొందరు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడ్నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత మున్నాను ఆటోలో స్థానిక ఆసుపత్రికి చేర్చారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నిందితుడి గురించి వెతికారు. తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)