స్పెర్మ్ - జీవనశైలి - ఆహారం

Telugu Lo Computer
0

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలిని పాటించాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అది అంత సులభం కాకపోయినప్పటికీ కాస్త శ్రద్ధ పెడితే సులభమే. కొన్నికొన్నిసార్లు ఆరోగ్యం కోసం అతిగా తీసుకునే ఆహారాలు కూడా మనకు హానీ తలపెడతాయి. అందుకే ఏదైనా సరే మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషికి రెస్ట్ అనేదే లేకుండా పోతోంది. ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం, ఏది పడితే అది, ఆ సమయానికి దొరికింది తినడం,
 వ్యాయామం చేయకపోవడం, ఇతర చెడు జీవనశైలి పురుషుల లైంగిక జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి అంశాల్లో ప్రధానంగా కొన్ని రకాల ఆహారాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. వాటిని అధికంగా తీసుకోవడం వలన, వీర్యం పలచన అవడంతో పాటు.. లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.  ప్రాసెస్ చేసిన మాంసాలు స్పెర్మ్ కౌంట్ తగ్గించడానికి కారణం అవుతున్నాయని అనేక అధ్యయనాల్లో పరిశోధకులు తేల్చారు. వీటి కారణంగా లైంగిక ఆరోగ్యం ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు. సోయాలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. సోయాను అధికంగా తినడం వల్ల స్పెర్మ్ పలుచగా అవుతుందని పరిశోధకులు వెల్లడించారు. అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు కూడా లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పలు నివేదికల్లో పేర్కొన్నారు. అధిక కొవ్వు పాల ఉత్పత్తుల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. దీనికి కారణం.. పాలు ఇచ్చే గెదెలు, ఆవులకు స్టెరాయిడ్స్ ఇవ్వడమేనని ఉదహరిస్తున్నారు. పెస్టిసైడ్స్ వినియోగించని కూరగాయలు, ఆహారం లభించే పరిస్థితి లేనే లేదు. మనం తినే పండ్లు, కూరగాయలకు వ్యవసాయంలో పురుగు మందులు వాడతారు. పురుగు మందుల రసాయనాలు జెనోఈస్ట్రోజెన్‌ల వలె పనిచేస్తాయి. వీటిని తినడం మూలంగా స్పెర్మ్ కౌంట్‌ క్రమంగా తగ్గుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)