పబ్లిసిటీ కోసం అంత డేంజరస్ ఫీట్ అవసరమా?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పడవ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ తాజాగా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇదంతా ఎల్లో మీడియా లైవ్ కవరేజీ కోసమే కదా అని కూడా విమర్శించారు. కాగా గురువారం నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద ఓ పడవలో నుంచి మరో పడవలోకి మారుతున్న సందర్భంగా పడవ ఓ వైపునకు ఒరిగిపోగా అందులోని టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, రామరాజు, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్ గోదావరిలో పడిపోయారు. అయితే అప్పటికే చంద్రబాబు పడవ నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా నీళ్లలో జారిపడిన టీడీపీ నేతలను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ.? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా? ఎల్లో మీడియా లైవ్ కవరేజి కోసమే కదా!

Post a Comment

0Comments

Post a Comment (0)