పార్లమెంటులో 99.18శాతం పోలింగ్ !

Telugu Lo Computer
0


రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటులో దాదాపు 99.18శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రోజు రాత్రికి వివిధ మార్గాల ద్వారా బ్యాలెట్ బాక్సులను అసెంబ్లీల నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్కు తరలించనున్నారు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. ఆమె 63 శాతానిపైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సమాచారం.. క్రాస్ ఓటింగ్ జరిగితే మెజార్టీ మరింత పెరిగే ఛాన్సుంది. పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి ఓటేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీపీఈ కిట్ ధరించి పోలింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్లో వచ్చి ఓటేశారు. ఎంపీలు శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్, చిదంబరం కూడా పోలింగ్ లో పాల్గొన్నారు. శరద్ పవార్ సమాజ్ వాదీ పార్టీ నేత, ఎంపీ ములాయంసింగ్ యాదవ్ వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వేశారు. టీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, మాలోతు కవిత, నామానాగేశ్వరరావు, ఏపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీలు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, నవనీత్ రాణాతో పాటు పలువురు ఎంపీలు ఓటేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)