గౌహతి హోటల్ ఖర్చు రూ.90 లక్షలు !

Telugu Lo Computer
0


అసోంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్‌లో ఎనిమిది రోజుల పాటు విడిది చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు బుధవారం చెక్ అవుట్ చేయడానికి ముందే రూ.90 లక్షల రూపాయల బిల్లులు క్లియర్ చేశారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, వారి సహచరుల కోసం హోటల్‌లోని వివిధ అంతస్తుల్లో మొత్తం 70 గదులు బుక్ చేయబడ్డాయి. జూన్ 22 నుండి జూన్ 29 వరకు, వారు బస చేసినంత కాలం నాన్-రెసిడెంట్ అతిథుల కోసం హోటల్ దాని రెస్టారెంట్లు, విందులు మరియు ఇతర సౌకర్యాలను నిలిపివేసింది. రాడిసన్ బ్లూ హోటల్లో గదులకు అద్దె రూ.7,500 నుంచి రూ.8,400 వరకూ వుంటుంది. ఈ లెక్కన ఎమ్మెల్యేల గదుల అద్దె సుమారుగా రూ.68 లక్షలవరకూ వుంటుందని తెలుస్తోంది. వీరి ఫుడ్ బిల్లు రూ.22 లక్షలయిందని అంచనా. మొత్తంమీద వీరు బస చేసినందకుకు అయిన ఖర్చు రూ.90 లక్షలు. రాడిసన్ బ్లూ గౌహతి మొత్తం ఈశాన్య ప్రాంతంలో మొదటి ఫైవ్ స్టార్ హోటల్. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో షిండే నేతృత్వంలోని అసమ్మతి శాసనసభ్యులు మరియు కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు జూన్ 22 తెల్లవారుజామున ముంబైకి 2700 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతిలోని ఈ హోటల్ కు వచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)