మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 July 2022

మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం


ఉత్తర ప్రదేశ్‌లో  సహరణ్‌పూర్ జిల్లా, దియోబంధ్ పరిధిలో గత జనవరిలో 24 ఏళ్ల మహిళ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక యువకుడు ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి మహిళను బెదిరించాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మహిళ తల్లిందండ్రులను చంపుతానని, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా తరచూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత దియోబంద్ పరిధిలో ఒక రహస్య ప్రాంతానికి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అక్కడ మహిళను బంధించి అతడితోపాటు, మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న నిందితులు ఆమెను మరింత హింసించారు. చంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది. అయితే, గత జూన్ 25న అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చిన మహిళ, 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. మహిళ చెప్పిన వివరాల ప్రకారం నిందితులంతా 25-30 ఏళ్లలోపు వయసువారే.

No comments:

Post a Comment