ఒకే స్టేషన్ నుంచి 66 మంది పోలీసులు బదిలీ

Telugu Lo Computer
0


కేరళ లోని కొయ్‌కోడ్‌ వడకర సమీపం తెరువాత్‌లో గతవారం సంజీవన్ (42) అనే వ్యక్తి కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని సంజీవన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే అస్వస్థతకు గురైన సంజీవన్‌ను పోలీసులు వేధించార ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతం సంజీవన్ ను కష్టడీ నుంచి విడుదల చేయగా సంజీవన్​ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్నేహితులు సమీప ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు​ మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు చిత్రహింసలు పెట్టటం వల్లే సంజీవన్ అస్వస్థతకు గురైయ్యాడని అయినా పోలీసులు పట్టించుకోలేదని.. సంజీవన్ కుటుంబ సభ్యులు, బంధువులు,స్నేహితులు ఆరోపించారు. ఇది కచ్చితంగా లాకప్‌ డెత్‌ అంటూ పోలీసుల తీరుపై మండిపడుతూ రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు, ఈక్రమంలో మానవహక్కుల సంఘం స్పందించింది.సంజీవన్ మృతిపై నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది​. ఈక్రమంలో అధికారులపై పినరయి విజయన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న 66 మంది పోలీసులను బదిలీ చేస్తూ.. హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)