కృష్ణా జిల్లా మినీ మహానాడు వాయిదా

Telugu Lo Computer
0


వాతావరణ పరిస్థితుల కారణంగా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని అంగలూరులో బుధవారం నిర్వహించాల్సిన ఉమ్మడి కృష్ణా జిల్లాస్థాయి మినీ మహానాడును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ తెలిపారు. మహానాడు సభాప్రాంగణం వద్ద మాజీ మంత్రులు, తెదేపా నేతలతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు అనుకూలించాక ఇదే ప్రాంతంలో రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అవినీతిపై తెదేపా పూరించిన తొలి శంఖారావం ఒంగోలు మహానాడు విజయవంతమైందని, అదే స్ఫూర్తితో అంగలూరులో నిర్వహిస్తామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా పనైపోయిందని.. దీంతో కొడాలి నాని కొత్త ఎత్తు వేసి ఎన్టీఆర్‌ విగ్రహాలకు వైకాపా రంగులేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌, తెదేపా నియోజకవర్గాల బాధ్యులు రావి వెంకటేశ్వరరావు, కాగిత కృష్ణప్రసాద్‌, వర్ల కుమారరాజా, బోడే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)