ప్రధాని సభకు చిరంజీవికి ఆహ్వానం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోదీ జూలై 4న   వస్తున్నారు. భీమవరంలో అల్లూరు సీతారామ రాజు 125 వ జయంతోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అమృత్ మహాత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి రానున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామ రాజు విగ్రహావిష్కరణ జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బీజేపీతో - ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. మాజీ కేంద్ర మంత్రిగా ఆయన పర్యాటక శాఖ పర్యవేక్షించారు. ఇప్పుడు ప్రధాని సభకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించటం ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగియగానే.చిరంజీవి కాంగ్రెస్ కు పూర్తిగా దూరమయ్యారు. ఆ పార్టీ ముఖ్య నేతలు పలుమార్లు చిరంజీవిని పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని కోరినా ఆసక్తి చూపలేదు. పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. గత కొద్ది నెలలుగా ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన తిరిగి తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక, బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు ఢిల్లీలో తన నియామకం ఖరారు కాగానే.. హైదరాబాద్ చేరుకున్న వెంటనే తన మిత్రపక్షం జనసేన అధినేత ను కాకుండా.. ముందుగా చిరంజీవిని కలిసారు. ఇక, బీజేపీ - జనసేన మిత్రపక్షంగా ఉన్నా రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)