విచిత్రంగా అవుటైన న్యూజిలాండ్ క్రికెటర్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 24 June 2022

విచిత్రంగా అవుటైన న్యూజిలాండ్ క్రికెటర్ !


ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ షాట్ ఆడగా అది అవతలి ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. చేసేందేమీ లేక న్యూజిలాండ్ ఆటగాడు నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ అవుట్ పట్ల ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా కాసేపు అయోమయంలోనే ఉండిపోయాడు. హెన్రీ నికోల్స్ ఎలా అవుట్ అయ్యాడో అతనికి కూడా అర్థం కాలేదు. జరిగిందేంటో అర్థం చేసుకోవడానికి ఇంగ్లాండ్ ఫీల్డర్లు, హెన్రీ నికోల్స్, డారిల్ మిఛెల్‌కు కూడా కొంత సమయం పట్టింది. క్రికెట్ రూల్స్ ప్రకారం బంతి స్టంప్ లేదా అంపైర్ లేదా ఫీల్డర్ లేదా అవతలి ఎండ్ బ్యాటర్‌కు తగిలి ఫీల్డర్ చేతిలో పడితే అవుట్ అయినట్లే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలాంటి అవుట్ ఎక్కడా నమోదు కాలేదు. అయితే గతంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్ దాదాపుగా ఇదే తరహాలో అవుటయ్యాడు. సైమండ్స్ కొట్టిన షాట్‌కు బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మైఖేల్ క్లార్క్ కాలిని తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నాడు. దీంతో సైమండ్స్ చిరునవ్వుతో వెనుదిరిగాడు. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెటర్ హెన్రీ నికొల్స్ కొట్టిన షాట్‌కు బంతి నాన్ స్ట్రైకర్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతిలోకి వెళ్లి పడింది. కాగా ఈ టెస్టులో న్యూజిలాండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ (82), బ్లండెల్ (54) ఉన్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో ఉంది.

No comments:

Post a Comment